- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాది పరిష్కారం లేని సమస్య.. నా నిర్ణయం రేపు ప్రకటిస్తా
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ తో భేటీ అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ తో భేటీ అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాది పరిష్కారం లేని సమస్య.. నా దగ్గరికి వచ్చి మాట్లాడిన వారి దగ్గర సైతం నా సమస్యకు పరిష్కారం దొరకలేదు.. ముందుగా చెప్పినట్లుగానే నా నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తా భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉంటుందో తెలియదు అంటూ పెద్దాయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వపక్షంతో యుద్ధం చేయాలేనన్నారు.
జీవన్ రెడ్డి రాజీనామా చేయరనే అనుకుంటున్నాం.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా జీవన్ రెడ్డి ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 43 ఏళ్ల పాటు పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్న జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకుల సేవలు పార్టీకి అవసరం అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డిని వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదన్నారు. జీవన్ రెడ్డితో చర్చించిన విషయాలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన పార్టీకి రాజీనామా చేయరనే ఆశతోనే జగిత్యాల నుంచి తిరిగి వెళుతున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
జీవన్ రెడ్డి ఇంటి పై ఫ్లెక్సీలు చింపేసిన అనుచరులు..
జీవన్ రెడ్డితో భేటీ అయిన టీపీసీసీ చీఫ్ ఇతర నాయకులు వెళ్లిన వెంటనే జీవన్ రెడ్డి ఇంటి పై ఏర్పాటు చేసిన ఇందిరా భవన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీలను ఆయన అనుచరులు చించివేశారు. పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తే మా నాయకుడికి ఇచ్చిన బహుమతి ఇదేనా అంటూ ఆయన అనుచరులు హై కమాండ్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.






