న‌డిరోడ్డుపై బైఠాయించిన‌ జీవన్ రెడ్డి

by velandi.Saikiran |

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది

న‌డిరోడ్డుపై బైఠాయించిన‌ జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల టౌన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిర భవన్ నుండి తాసిల్ చౌరస్తా వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాలు పట్టుకుని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా యూపీఏ ప్రభుత్వం గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ పేరుతో అమలు అయితే కాంగ్రెస్ పేరు ప్రజల గుండెల్లో నిలుస్తుందని, కేంద్రం దాన్ని నీరుగార్చాలని చూస్తోందని ఆరోపించారు. అలాగే శ్రీరాముడి పేరు రాజకీయాలకు ఉపయోగించడం సరికాదని, ఆయన అందరికీ ఆరాధ్య దైవముని, ఆదర్శమూర్తి అని, ఆయన పేరును రాజకీయాలకు ముడి వేయడం సరికాదని హెచ్చరించారు. మహాత్మా గాంధీ చివరి శ్వాసలో హే రామ్ అన్నారని, కలియుగంలో రామ భక్తుడైన గాంధీ పేరును తొలగించడం ఏమిటని ప్రశ్నించారు.

Next Story