- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ బీఫామ్స్ ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎవరు?.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై జీవన్‌రెడ్డి ఘాటు విమర్శలు
కాంగ్రెస్ బీఫామ్స్ ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎవరు?..

దిశ, జగిత్యాల ప్రతినిధి: కాంగ్రెస్ బీఫామ్స్ ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎవరు?.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఫైరయ్యారు. సోమవారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఏ పార్టీలో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజ్యాంగ నిబంధనలు నైతిక విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ బీ ఫామ్స్ ఇవ్వడానికి అసలు ఎమ్మెల్యే ఎవరని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ప్రజాపాలన, సంక్షేమ పథకాలకు మద్దతిస్తే స్వాగతిస్తామని అంతేకానీ పార్టీ విషయాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అభివృద్ధికై సీఎం లను కలవడం సహజమని తాను కూడా గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉండి అభివృద్ధి విషయంలో అప్పటి సీఎంను కలిసినట్లు గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులను కాపాడటం నా బాధ్యత
తాను ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళలేదని ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. గౌరీ శంకర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీకి సింగిల్ టెండర్ తో పనులు ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 2 సంవత్సరాల గడుస్తున్నా సమీకృత మార్కెట్ అందుబాటులోకి రాకపోగా గోదాంగా మార్చేసారని ఇదేనా చేసిన అభివృద్ధి అని ఎమ్మెల్యేను నీలదీశారు. యావర్ రోడ్డు విస్తరణ పనులు అడ్డుకుంటున్నదే ఎమ్మెల్యే అని ఆరోపించారు. పదేళ్లు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలన్నది తన డిమాండ్ అని తెలిపిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులను కాపాడటం తన బాధ్యత అని స్పష్టం చేశారు.






