తల్లిదండ్రులపై హింస కేసులో కొడుకు కు జైలు శిక్ష

by Ratna Kumari |

దిశ, జగిత్యాల టౌన్ : త‌ల్లిదండ్రుల‌పై హింస కేసులో కొడుకు జైలు శిక్ష ప‌డిన ఘ‌ట‌న జ‌గిత్యాల ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్

తల్లిదండ్రులపై హింస కేసులో కొడుకు కు జైలు శిక్ష
X

దిశ, జగిత్యాల టౌన్ : త‌ల్లిదండ్రుల‌పై హింస కేసులో కొడుకు జైలు శిక్ష ప‌డిన ఘ‌ట‌న జ‌గిత్యాల ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన వృద్ధాప్కారుల రక్షణ చట్టం కేసులో నిందితుడు మండలోజు రమేష్‌కు ఒక నెల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ శ్రీనిజ కోహిల్కర్ తీర్పు చెప్పారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. జగిత్యాల గంజీ స్ట్రీట్‌లో నివసించే మండలోజు రమేష్ వయోవృద్ధులైన తల్లిదండ్రుల ఆరోగ్యం, పోషణను పట్టించుకోకుండా వారి పేరుపై ఉన్న ఇల్లు రిజిస్టర్ చేయమని ఇబ్బంది పెట్టాడు. దీంతో తల్లిదండ్రులు జ‌గిత్యాల‌ టౌన్ పీఎస్ లో పిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షాదారాలను పరిశీలించిన జిల్లా మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

Next Story