- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ పథకాలకు ఎంపికైన జిల్లా పోలీసులు
పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాలకు 17మంది జిల్లా పోలీసులు ఎంపికయ్యారు.

దిశ, జగిత్యాల టౌన్: పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాలకు 17మంది జిల్లా పోలీసులు ఎంపికయ్యారు. ఎంపికైన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. విధినిర్వహణలో భాగంగా కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు వస్తుందని అన్నారు. ఉత్తమ సేవా పథకంకు జగిత్యాల డిస్టిక్ ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ఎస్ఐ రామస్వామి, డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు.
సేవా పథకంలకు మెట్పల్లి ఏఎస్ఐ లు జమీల్ అహ్మద్, నరసింహారెడ్డి, డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ బిక్షపతి, కోరుట్ల ఏఎస్ఐ సత్తయ్య, జగిత్యాల ఏఆర్ఎస్ఐ శ్రీనివాస్, మల్యాల హెడ్ కానిస్టేబుల్స్ రవి, మల్లారెడ్డి, కథలాపూర్ హెడ్ స్టేబుల్స్ నాయక్, శ్రీనివాస్ లు,మేడిపల్లి హెడ్ కానిస్టేబుల్స్ ప్రకాష్, ఇలియాస్ అహ్మద్, జగిత్యాల ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్ నాగన్న, మల్లారెడ్డి లు, గొల్లపల్లి హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి, ఇబ్రహీంపట్నం హెడ్ కానిస్టేబుల్ తనోబా లు ఎన్నికయ్యారు.






