అందుకే రాజకీయాల్లోకి వచ్చా...జగిత్యాల ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

సేవ చేయాలని లక్ష్యం తోనే రాజకీయాల్లోకి వచ్చానని ప్ర‌క‌టించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

అందుకే  రాజకీయాల్లోకి వచ్చా...జగిత్యాల ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X

దిశ, బీర్ పూర్: సేవ చేయాలని లక్ష్యం తోనే రాజకీయాల్లోకి వచ్చానని ప్ర‌క‌టించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్. బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరై ట్రస్ట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ...సామాజిక సేవా తోనే రాజకీయాల్లోకి రావడం జరిగిందని అనునిత్యం ప్రజల్లో ఉండి బీర్పూర్ మండల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్ల‌డించారు. దేవస్థానంలో రాజకీయాలకు స్థానం లేదని రాజకీయాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండి నిత్యం సేవ చేస్తాన‌ని పేర్కొన్నారు.

బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధికి గతంలో నిధులు మంజూరు చేసిన‌ట్లు గుర్తు చేశారు. మరింత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని కోరారు. బీర్పూర్ ను పర్యటక రంగంగా అభివృద్ధి చేయటానికి కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు. టూరిజం శాఖ మంత్రి తో మాట్లాడి ఒక కోటి నిధుల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. తన వంతుగా ఆలయ అభివృద్ధికి ఒక లక్ష రూపాయల విరాళం అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్రరావు, ఈవో శ్రీనివాస్, ధర్మపురి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహులు, ఆలయ నూతన ట్రస్టు సభ్యులు చీర్నేని శ్రీనివాస్, రమేష్, లక్ష్మణ్ గత సభ్యులు మండల నాయకులు తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story