ఫ్లాష్.. ఫ్లాష్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వణికించిన భూకంపం

by Bhanu |   (  Updated:2025-05-05 13:44:08  IST  )

జగిత్యాల జిల్లాలో సోమవారం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు భూమి కనిపించింది.

ఫ్లాష్.. ఫ్లాష్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వణికించిన భూకంపం
X

దిశ బ్యూరో, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భూకంపం వణికించింది. జగిత్యాల, వేములవాడతో పాటు రుద్రంగిలో సోమవారం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు భూమి కనిపించింది. సుమారు ఐదు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.. భూమి కనిపించడంతో ఇంట్లోని వస్తువులు చిన్నపాటి కుదుపులకు గురయ్యాయి. స్వల్ప భూకంపం కారణంగానే భూమి కనిపించినట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఈ భూకంపం తీవ్రత జిల్లా వ్యాప్తంగా ఉన్నట్లుగా సమాచారం. అయితే.. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.9గా నమోదైనట్లు సమాచారం.

Next Story