ముంబైలో జగిత్యాల బస్సుకు మంటలు.. తప్పిన భారీ ప్రమాదం!

by Ratna Kumari |

ముంబైలో జ‌గిత్యాల బ‌స్సుకు మంట‌లు అంటుకున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగా మంగ‌ళ‌వారం పూర్తిగా ద‌గ్ధం అయింది.

ముంబైలో జగిత్యాల బస్సుకు మంటలు.. తప్పిన భారీ ప్రమాదం!
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : ముంబైలో జ‌గిత్యాల బ‌స్సుకు మంట‌లు అంటుకున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగా మంగ‌ళ‌వారం పూర్తిగా ద‌గ్ధం అయింది. జగిత్యాల నుంచి ముంబయికి 35 మంది ప్రయాణికులతో వెళ్లిన MP 45 ZE 7447 నంబర్ గల వీనస్ ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ముంబై చేరుకున్న తర్వాత ప్రయాణికులను సురక్షితంగా దింపిన తర్వాత అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రమాదం జరిగే సమయానికి కొన్ని నిముషాల ముందే ప్రయాణికులు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తమను దింపిన వెంటనే బస్సు దగ్ధం కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story