బాస్కెట్ బాల్ టోర్నమెంట్ కు ఎంపికైన జగిత్యాల విద్యార్థి

by velandi.Saikiran |

జాతీయస్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ కు జగిత్యాల కేజీఆర్ స్కూల్ విద్యార్థి ఎంపిక అయ్యారు. గద్వాల జిల్లా ఉత్తనూర్ లో జరిగ

బాస్కెట్ బాల్ టోర్నమెంట్ కు ఎంపికైన జగిత్యాల విద్యార్థి
X

దిశ జగిత్యాల, రూరల్: జాతీయస్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ కు జగిత్యాల కేజీఆర్ స్కూల్ విద్యార్థి ఎంపిక అయ్యారు. గద్వాల జిల్లా ఉత్తనూర్ లో జరిగిన రాష్ట్రస్థాయి బాస్కట్ బాల్ టోర్నమెంట్ లో 75 జూనియర్ ఛాంపియన్ షిప్ టీంకు మెరుగైన ప్రతిభ కనబరిచిన వడ్డేపల్లి సుధన్వి జాతీయ స్థాయికి ఎంపికయ్యింది. జగిత్యాల జిల్లా నుంచి జాతీయస్థాయికి తమ విద్యార్థి ఎంపిక కావడం ఆనందంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ గంగారెడ్డి విద్యార్థిని అభినందించారు.

జాతీయ స్థాయి పోటీలు ఈనెల సెప్టెంబర్ 2 నుంచి 9వ తేది వరకు పంజాబ్ లోని లూథియానా లో జరగనున్నాయి. స్కిర్మీస్ బాస్కట్ బాల్ అకాడమీ ఫౌండర్ (skirmish basketball academy) శ్రీరామ్, సంపత్, విజ్ఞాన్, ఇచ్చిన కోచింగ్ లో ప్రతిభను కనబరిచి నేషనల్ బాస్కట్ బాల్ టోర్నమెంట్ టీంకు సెలక్ట్ అయ్యానని విద్యార్థిని పేర్కొన్నారు. జగిత్యాల నుంచి సుధన్వి నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొననుంది. విద్యార్థి నేషనల్ టోర్నమెంట్ కు ఎంపిక కావడంతో పలువురు అభినందించారు.

Next Story