- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్నూరు కాపుల జనాభా తగ్గించి చూపించడం అన్యాయం
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన సర్వేలో మున్నూరు కాపులను బీసీలలో నాలుగో స్థానంలో చూపించడం పూర్తిగా అన్యాయమని చొప్పదండి నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం కన్వీనర్ మడ్లపల్లి శ్రీనివాస్ అన్నారు.

దిశ, గంగాధర : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన సర్వేలో మున్నూరు కాపులను బీసీలలో నాలుగో స్థానంలో చూపించడం పూర్తిగా అన్యాయమని చొప్పదండి నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం కన్వీనర్ మడ్లపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం గంగాధరలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో నిర్వహించిన కులగణన సర్వేలో మున్నూరు కాపులను రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గంగా మొదటి స్థానంలో చూపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో అదే వర్గాన్ని నాలుగో స్థానంలో చూపించడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. మున్నూరు కాపుల జనాభాను కావాలనే తక్కువగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఇప్పటివరకు మున్నూరు కాపులకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించకపోవడం కూడా బాధాకరమని విమర్శించారు. ఈ ప్రభుత్వం మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులగణన సర్వేను మళ్లీ నిర్వహించి నిజమైన జనాభా వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మున్నూరు కాపులకు తక్షణమే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మున్నూరు కాపుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం నాయకులు మాజీ సర్పంచ్ మడ్లపల్లి గంగాధర్, మాజీ వైస్ చైర్మన్ సామంతుల శ్రీనివాస్, వార్డు సభ్యులు గంట కిషన్, దొడ్ల ఎల్లారెడ్డి నాయకులు గంట రమేష్, గంట హరీష్, రాంశెట్టి తిరుపతి, పులిచెర్ల లక్ష్మీనరసయ్య, గంట లచ్చయ్య, దేశెట్టి మల్లారెడ్డి, దేశెట్టి రమేష్ పాల్గొన్నారు.






