- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్య ఆత్మహత్యకు కారణం వివాహేతర సంబంధమేనా..?
మృతురాలి భర్త ఉదయ్ కోరుట్ల పట్టణానికి చెందిన ఓ మహిళాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, భర్త వివాహేతర సంబంధాన్ని ఎదిరించినందుకే వాగ్వాదం చోటు చేసుకోవడంతో దివ్య ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఓ యువతీ అనుమాదాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేసులో కీలక మలుపు తిరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఇల్లేందుల దివ్య(34) సోమవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్న ఘటన గ్రామస్తులను కలచివేసింది. కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ అనే వ్యక్తికి మెట్ పల్లి పట్టణానికి చెందిన దివ్య అనే మహిళను 2013 లో ఉదయ్ తో పెళ్లి జరిగింది. అయితే వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కలరు. మృతురాలి భర్త ఉదయ్ కోరుట్ల పట్టణానికి చెందిన ఓ మహిళాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, భర్త వివాహేతర సంబంధాన్ని ఎదిరించినందుకు దివ్యను భర్త ఇల్లెందుల ఉదయ్, మామ ఇల్లెందుల బ్రహ్మయ్య లు మానసికంగా, శారీరకంగా వేధించారని.. వీరి బాధ భరించలేక తన కూతురు మరణించిందని మృతురాలి తండ్రి కోటగిరి గోపాల చారి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు ముగ్గురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు.






