అంత మా ఇష్టం.. కోరుట్లలో వేళాపాళా లేని కరెంట్ కోతలు

by Disha Web Desk 12 |
అంత మా ఇష్టం.. కోరుట్లలో వేళాపాళా లేని కరెంట్ కోతలు
X

దిశ, కోరుట్ల టౌన్: కోరుట్ల విద్యుత్ శాఖ అధికారులు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వేళాపాళా లేకుండా కరెంట్ కోతలు విధిస్తూ.. వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కల్లూరు రోడ్‌లో నిత్యం ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అక్కడికి ప్రభుత్వ సేవలు వినియోగించుకునేందుకు కోరుట్ల డివిజన్ లోని వివిధ గ్రామాల నుంచి వస్తుంటారు. అలాగే ఆ ప్రాంతంలోని వ్యాపారస్తులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల అవసరాలను గమనించకుండా మరమ్మతుల పేరుతో ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విద్యుత్ నిలిపివేస్తున్నారు. ఇట్టి విషయమై స్థానిక ఏ ఈ నీ వివరణ కోరగా.. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ముందస్తు సమాచారం ఇచ్చి విద్యుత్ మరమ్మతులు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.


Next Story