సంబురంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-25 14:18:26  IST  )

పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు నిర్మించుకున్న నూతన గృహంలోనికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథి గా హాజరు కాగా గురువారం గృహప్రవేశం చేశారు.

సంబురంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
X

సంబురంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

భీమదేవరపల్లిలో హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం

దిశ భీమదేవరపల్లి: పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు నిర్మించుకున్న నూతన గృహంలోనికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథి గా హాజరు కాగా గురువారం గృహప్రవేశం చేశారు. మండలం భీమదేవరపల్లి లో మార్పాటి సుధా అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇంటి ప్రారంభోత్సవం చేశారు. తమ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు సుధా అశోక్ రెడ్డి దంపతులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసిన లబ్ధిదారు మార్పాటి సుధా దంపతులకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కళ్యాణి లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధదారులకు చెక్కులు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆ తర్వాత కొత్తపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమేష్ రాథోడ్, గృహ నిర్మాణ శాఖ డిఈ రవీందర్,తహసీల్దార్ రాజేష్ ఎంపిడిఓ వీరేశం, ఏవో పద్మ, పంచాయతీ కార్యదర్శిలు జంగం పూర్ణచందర్, రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్టెంపల్లి ఐలయ్య, మహిళా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు చిదురాల స్వరూప, సీనియర్ నాయకులు కొలుగూరి రాజు,ఆదరి రవీందర్, పోగుల శ్రీకాంత్, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story