ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చెయ్యాలి

by Elthuri vijay kumar |

ఈజీఎస్ ద్వారా మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చెయ్యాలి
X

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చెయ్యాలి

- ఈజీఎస్ ద్వారా మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

- జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల రూరల్ మండలం లోని వెల్దుర్తి, కండ్లపెళ్లి గ్రామాలను సందర్శించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ముందుగా వెల్దుర్తి గ్రామంలో నిర్మిస్తున్న పంచాయతీ భవన పనులను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం కండ్లపెల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ ను పరిశీలించి, గ్రామంలో ఈజీఎస్ ద్వారా మంజూరైన అంగన్ వాడీ కిచెన్ షెడ్ పనులపై అరా తీసి నాణ్యతతో వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంజనీరింగ్ పంచాయతీ అధికారి లక్ష్మణరావు జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్ ఎంపీడీవో రమాదేవి తహసీల్దార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story