పేదోడి సొంతింటి కల ప్రభుత్వ ధ్యేయం :మంత్రి లక్ష్మణ్ కుమార్

by Bhanu |

ప్రతి పేదోడి కల అయిన సొంతింటి నిర్మాణం నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి ప్రొసీడింగ్స్ అందజేశారు.

పేదోడి సొంతింటి కల ప్రభుత్వ ధ్యేయం :మంత్రి లక్ష్మణ్ కుమార్
X

దిశ, గొల్లపల్లి : ప్రతి పేదోడి కల అయిన సొంతింటి నిర్మాణం నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి పేదవాడికి విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల కట్టించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మండలానికి ఒక్క డబుల్ బెడ్ రూం మంజూరు చేయలేదని కానీ నేడు ప్రజా ప్రభుత్వంలో గొల్లపల్లి మండలానికి 400 ఇండ్లను మంజూరు చేసిందని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిన ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలు చేస్తున్నామని దానిలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నామని అన్నారు. ముందుగా ప్రతి మండలం లో ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి ఆ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామని ఇప్పుడు ప్రతి గ్రామంలో అర్హులైన వారికి ఇండ్ల మంజూరు చేశామని కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నిర్మాణాలు మొదలు అయ్యాయని నిర్మాణం మొదలు పెట్టని వారు త్వరగా ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలని ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వమే ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుందని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్,ఆర్డీఓ మధుసూధన్,ఎంపిడిఓ రాం రెడ్డి,తహశీల్దార్ వరంధన్, ఎంపీఓ సురేష్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్,వైస్ చైర్మన్ రాజీ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నీశాంత్ రెడ్డి,నాయకులు కాసారపు అరవింద్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story