- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో కేసులో ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా..!
పోక్సో కేసులో ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2వేలు జరిమానా విధించారు సిరిసిల్ల పోక్సో కోర్టు జడ్జీ రాధిక జైస్వాల్.

దిశ, ఎల్లారెడ్డిపేట : పోక్సో కేసులో ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2వేలు జరిమానా విధించారు సిరిసిల్ల పోక్సో కోర్టు జడ్జీ రాధిక జైస్వాల్. గురువారం ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను 2021లో వరుసకి అన్న అయ్యే తూర్పాటి ప్రవీణ్ బలవంతపు వేధింపులకు గురి చేశాడు. దీంతో ప్రవీణ్ తండ్రి జానీ, నాన్నమ్మ పోచవ్వలు ఎవరికైనా చెబితే చంపేస్తాం అని బాధితులను బెదిరించారు. ఈ విషయం పై బాధితురాలు తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్సై వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీలు వేముల లక్ష్మీ ప్రసాద్, పెంట శ్రీనివాస్ వాదించారు.
సీఎంఎస్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు మానిటరింగ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, నవీన్ లు కోర్టులో 10 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన సిరిసిల్ల పోక్సో కోర్టు జడ్జీ రాధిక జైస్వాల్ ఇద్దరు నిందితులైన తూర్పాటి జానీ, తూర్పాటి పోచవ్వకి నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2వేలు చొప్పున జరిమానా విధించినట్టు ఎస్పీ మహేష్ బి తెలిపారు. సమాజంలో నేరం చేసిన వారు ఎవ్వరు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరని.. శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని తెలిపారు. నిందితులకు శిక్ష పడటంలో కృషి చేసిన డీఎస్పీ చంద్రశేఖర్, పీపీలు వేముల లక్ష్మీ ప్రసాద్, పెంట శ్రీనివాస్, సీఎంఎస్ ఎస్సై రవీంద్ర నాయుడు, కోర్టు కానిస్టేబుల్ నవీన్, శ్రీనివాస్, ఎస్సై వెంకట కృష్ణలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.






