- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు, స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
పార్టీ ఫిరాయింపుల అంశంలో ఎదుర్కొంటున్న ఆరోపణలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : పార్టీ ఫిరాయింపుల అంశంలో ఎదుర్కొంటున్న ఆరోపణలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. ఆదివారం మోతె పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పీకర్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికై తాను సీఎంను కలిస్తే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడి రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే టీడీపీ నుండి బీఆర్ఎస్ లో చేరలేదా అని ప్రశ్నించారు. కోరుట్లకు వచ్చిన ఇంజినీరింగ్ కాలేజీని హైదరాబాద్‌కు తరలించారని, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తమ హయాంలో అమ్మి చివరకు మూతపడే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే జగిత్యాలకు రూ.34 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి “నరికేస్తా.. చంపేస్తా” అంటూ మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలో అలాంటి పదాలకు చోటులేదని పేర్కొన్నారు. గతంలో టిడిపి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరలేదా ప్రశ్నించారు. కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఇంటి పార్టీ కాదన్న ఎమ్మెల్యే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే అభివృద్ధి జరగదని ఎద్దేవా చేసారు. విమర్శించే ముందు తమ తప్పులు గుర్తించుకోవాలని సూచించారు. టికెట్ల విషయం కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ చూసుకుంటుందన్న ఎమ్మెల్యే గెలుపు గుర్రాలకే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటే తన మద్దతు వారికే ఉంటుందన్నారు.






