- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఎన్నికల్లో అత్తా-కోడలు, బావ బావమరిది మధ్య పోటీ..!
దిశ, ఎల్లారెడ్డిపేట : స్థానిక సంస్థల ఎన్నికలు ఈనెల 17న మూడో విడుత సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించి జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఎల్లారెడ్డి పేట గ్రామపంచాయతీ

దిశ, ఎల్లారెడ్డిపేట : స్థానిక సంస్థల ఎన్నికలు ఈనెల 17న మూడో విడుత సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించి జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఎల్లారెడ్డి పేట గ్రామపంచాయతీ సర్పంచ్ పదవీకి బావ, బావమరిది పోటీ పడుతున్నారు. మరోవైపు వెంకటాపూర్ గ్రామపంచాయతీ బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించారు. ఈ స్థానం నుంచి సర్పంచ్ పదవీకి అత్తా, కోడలు పోటీ పడి నామినేషన్ వేశారు. ఎల్లారెడ్డి పేట గ్రామపంచాయతీ పదవీకి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు (బావమరిది), బీఆర్ఎస్ నుంచి మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఎలగందుల నరసింభులు(బావ) సర్పంచ్ పదవీకి శుక్రవారం నామినేషన్లు వేశారు. బీజేపీ తరుపున అంతెర్పుల తిరుపతి, సర్పంచ్ పదవులకు జితెందర్, ఎడ్ల రాజ్ కుమార్, ఈసరి కిరణ్, శనిగరం బాలరాజు, లింగాల సన్నీ, ఎరువుల శ్రీనివాస్, రాందాస్, రమేష్, ప్రమోద్, కనకరాజు నామినేషన్లు వేశారు. మహిళా జనరల్ కి కేటాయించిన వెంకటాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ లుగా అత్త మామిళ్ల నరసవ్వ, వీఆర్ఎస్ నుంచి కోడలు మామిళ్ల అంజలి ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి రుద్రుజు వినీల, బీజేపీ నుంచి మేడిశెట్టి పద్మ నామినేషన్లు వేశారు. మండల వ్యాప్తంగా నామినేషన్ల పర్వం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా జరిగాయని తహశీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు.






