అక్కతో తగువుతో క్షణికావేశంలో కఠిన నిర్ణయం

by Bhanu |

బీర్ పూర్ మండల కేంద్రానికి చెందిన యువతి అల్లేపు సుప్రియ (21) క్షణికావేశంలో తీసుకున్న ఆత్మఘాతక నిర్ణయం తీవ్ర విషాదానికి దారి తీసింది.

అక్కతో తగువుతో క్షణికావేశంలో కఠిన నిర్ణయం
X

దిశ, బీర్ పూర్: బీర్ పూర్ మండల కేంద్రానికి చెందిన యువతి అల్లేపు సుప్రియ (21) క్షణికావేశంలో తీసుకున్న ఆత్మఘాతక నిర్ణయం తీవ్ర విషాదానికి దారి తీసింది. కుటుంబ వాదనలు, భావోద్వేగాలు ఆమె జీవితం ముగించేందుకు కారణమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు, సుప్రియకు తన అక్కతో ఒక చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదాన్ని గమనించిన ఆమె తండ్రి అశోక్, ఇంట్లో వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా మారేందుకు సుప్రియను మందలించారు.

అయితే తనకే తండ్రి మందలించాడన్న మనస్తాపంలో, క్షణికావేశంతో సుప్రియ గడ్డి మందు సేవించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఈ విషాదకర సంఘటనపై మృతురాలి తండ్రి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని బీర్ పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ రవీందర్ తెలిపారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సమాజానికి తీరని దుఃఖాన్ని మిగులుస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Next Story