పసి పాప మృతికి కార‌ణ‌మైన వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

by Nallavelli.Anjaneyulu |

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో రెండు నెల‌ల ప‌సిపాప మృతికి కార‌ణ‌మైన వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకొని, క‌ఠిన శిక్ష విధించాల‌ని మంథ‌ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మ‌ధూక‌ర్ డిమాండ్ చేశారు.

పసి పాప మృతికి కార‌ణ‌మైన వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
X

దిశ, మంథని : పసిపాప మృతికి కార‌ణ‌మైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ మంథని మాజీఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. గురువారం మంథని పట్టణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు మౌన ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నాగకర్నూల్‌ జిల్లా కుమ్మెర‌ మల్లన్న దేవాలయంలో దర్శనానికి వెళ్లిన కుటుంబంపై కులవివక్షతో దాడి చేసి రెండు నెలల పసిపాప‌ మృతికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్ చేశారు. గణేష్‌- మౌనిక దంపతుల కూతురు బేబీ మౌనిక ప్రపంచాన్ని చూడకముందే కులవివక్ష ఆ పసిపాప ప్రాణం తీసిందన్నారు. ఈ ఘటన మనం ఏ దశాబ్దంలో ఉన్నామో అర్థం కావడం లేదని, ఇంకా అనాగరికతలోనే ఉన్నామా అనే ఆలోచన కలుగుతుందని ఆయన వాపోయారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడు తన నైజాన్ని చూపుతుందని, ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు. 1991 చుండూరులో కులాలకు కులాలకు మధ్య జరిగిన తగువులాటలో దళితులు చనిపోయారని, తాజాగా నల్గొండ జిల్లాలో రాజేష్‌ అనే యువకుడు లాకప్‌ డెత్‌లో చనిపోతే అక్కడ ఎస్‌హెచ్‌ఓగా ఉన్న ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రక్షిస్తూ సంఘటనకు బాధ్యుడిని చేస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందిన సీఐని సస్సెండ్‌ చేశారని ఆయన వివరించారు. ఓసీలను రక్షిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఇబ్బందులకు ఎలా గురి చేస్తున్నారో నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటనే అర్థం అవుతుందన్నారు. మంథని ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే ఎవరు చనిపోయినా తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా బాధపడ్డారని, ఏడ్చి కమలహాసన్‌ను మించి వ్యవహరించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24నెలలో 48మందిచనిపోయారని వారికి కనీసం పరిహారం అడుగడానికి అవకాశం లేకుండా పోలీసులు మార్చురీ పడేస్తున్నారని, రక్తం కనబడకుండా సర్ప్‌ వేసి కడిగి ఆనవాళ్లు లేకుండా మంథని ఎమ్మెల్యే ఘనకీర్తి సాధించాడన్నారు. కులాలను పుట్టించిన కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కులాల మధ్య వైశమ్యాలను లేపడం అవమానపర్చడం సాధారణమైందన్నారు.


సీఎం, హోమంత్రి శాఖ‌లు ఉన్న రేవంత్‌రెడ్డి ఈ సంఘటనపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రత్యక్షంగా ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్‌ చేయకుండా కాపాడటం, చనిపోయిన వారి కుటుంబంపై కేసులు పెట్టించడం, వాళ్లకు వాళ్లే గలాటా సృష్టించి మళ్లీ దానిని బాధితులను బాధ్యులను చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర నలుమూలలో ఇలాంటి ఘటనలే జరుగుతాన్నాయని, పోలీసులు పూర్తిగా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకుని పని చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బారత రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ను ఏనాడు గౌరవించలేదు అవమానస్తూనే ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో దేశంలో ఉన్న మేధావులుగా చెలామణి అవుతూ కాంగ్రెస్‌ పార్టీకి వత్తాసు పలుకుతున్న వాళ్లు ఇలాంటి ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రెండు నెలల పసిపాప చనిపోతే ఎందుకు మాట్లాడటంలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రజక బిడ్డ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని పెండ్లి చేసుకుని ఆదర్శంగా నిలిస్తే కాంగ్రెస్‌ పార్టీకి కండ్లు మండాయన్నారు. రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్‌ గాంధీ కులాలు అంటే తెలియని అన్నాడని, ఇలాంటి సంఘటనలపై స్పందించాలని ఆయన హితవు పలికారు. పసిపాప మృతిలో బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Next Story