- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ శాఖలో అక్రమార్కులు
అక్కడ ప్రతి పనికీ ఓరేటు ఉంటుంది. పైసల్ ముట్టనిదే ఫైళ్లు ముందుకు కదలవు. ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు ఎవరి రేటు వారిదే.. అయితే ఆఫీసుకు పనికోసం వచ్చిన వారితో బేరం కుదుర్చేందుకు కింది స్థాయి ఉద్యోగులు పనిచేస్తుంటే చేతులకు మట్టి అంటకుండా పైసల్ వసూల్ చేసేందుకు ప్రయివేటు వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తారు.

దిశ, కరీంనగర్ బ్యూరో: అక్కడ ప్రతి పనికీ ఓరేటు ఉంటుంది. పైసల్ ముట్టనిదే ఫైళ్లు ముందుకు కదలవు. ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు ఎవరి రేటు వారిదే.. అయితే ఆఫీసుకు పనికోసం వచ్చిన వారితో బేరం కుదుర్చేందుకు కింది స్థాయి ఉద్యోగులు పనిచేస్తుంటే చేతులకు మట్టి అంటకుండా పైసల్ వసూల్ చేసేందుకు ప్రయివేటు వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తారు. దీంతో పేమెంట్ ఆన్ లైన్ లేక ఆఫ్ లైన్ ఏదైనా పర్వాలేదు అన్నట్టుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్కడా డబ్బులు ముట్టాయి అని సిగ్నల్ అందగానే పర్మిషన్ పత్రాలను వారికి అప్పగిస్తారు. షాపుల నిర్వహణ పర్యవేక్షణపై నిత్యం తనిఖీలు చేసే అధికారం వారిచేతుల్లోనే ఉండటం చేత వారు అడిగినంత సమర్పించి అనుమతులను పొందుతున్నారు. దీంతో వ్యవసాయ శాఖలో అక్రమ దందా మూడు పువ్వులు ఆరుకాయలు అన్న చందంగా సాగుతుంది
డబ్బులు ఇస్తేనే అనుమతులు
కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ శాఖలో అవినీతి అధికారులది ఆడిందే ఆట పాడిందే పాఠ అన్న చందంగా తయారైంది. విత్తనాలు, ఎరువులషాపు (సీడ్స్ &పెస్టిసైడ్స్) అనుమతులు పొందాలంటే వ్యవసాయ శాఖ అధికారులకు అడిగినంతే ముట్టజెప్పితే తప్పా అనుమతులు వచ్చే పరిస్థితి లేకపోవడం కరీంనగర్ జిల్లాలో ఆందోళన కలిగిస్తుంది. అయితే అందుకు ప్రత్యేక రేట్లను ఫిక్స్ చేసిన అధికారులు వారికి ఆ మొత్తం అప్పజెప్పితేనే అనుమతులు ఇస్తున్నారు. లేదు కుదరదు అంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టు తిప్పుతున్న పరిస్థితి నెలకొంది. అయితే నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు అక్రమాలకు పాల్పడుతూ అనుమతులు ఇవ్వడంతో అడిగినంత ఇచ్చి అనుమతులు తీసుకోక తప్పడం లేదు
అక్రమాల్లో ఎవరి వాట వారిదే
అనుమతులకు డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు అందుకు ప్రత్యేక రేట్లను ఫిక్స్ చేశారు. సీడ్స్ షాపు అనుమతి కావాలి అంటే 5000 వేలు, ఫెస్టి సైడ్స్ షాపు అనుమతి కావాలి అంటే 5000 రేట్లను ఫిక్స్ చేసిన అధికారులు అందులో ఎవరి వాట వారికి ముడితేనే పైళ్లు ముందుకు కదిలిస్తారు. లేదు అంటే కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తారు ఆఫీసుకు వచ్చిన బాధితులతో అధికారులు అటెండర్ సంప్రదించండి అంటూ సలహా ఇస్తూ సైడ్ అవుతారు ఆపై అటెండర్ ఆ మొత్తాన్ని ఎలా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలో సూచిస్తాడు. ఆ మొత్తం అతడు చెప్పిన వారికే ఇస్తే వారు డబ్బులు ముట్టినట్టు ధ్రువీకరించడంతో ఫోన్ చేసి పిలిచి ఆ అనుమతి పత్రాలను అందజేయడం ఇక్కడి ప్రత్యేకత.
ఆన్ లైన్ సెంటర్ నిర్వాహకులే కీలకంగా వసూళ్ల దందా
సీడ్స్ అండ్ ఫెస్టి సైడ్స్ షాపుల అనుమతులకోసం డబ్బులు వసూల్ చేస్తున్న అధికారులు వారి చేతికి మట్టి అంటకుండా ప్రయివేటు వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమ వసూళ్లకు ప్రయివేటు ఏజెంట్లను ఏర్పరచుకున్న అధికారులు వారి ద్వారా ఆప్ లైన్, ఆన్ లైన్ ద్వార ఆ మొత్తాన్ని తీసుకుంటున్నారు. అడిగిన మొత్తం వారికి ఆన్ లైన్, ఆప్ లైన్ లలో డబ్బును పంపించిన వెంటనే ఆ సమాచారాన్ని కోడ్ బాష ద్వార అంటెండర్ కు తెలియపరుస్తారు. అటెండర్ అధికారులకు చేరవేర్చడంతో అనుమతి పత్రాలను బాధితులకు అప్పజెప్పుతారు. పైగా ఇప్పటితో పని ముగియడంలేదు. నిత్యం షాపులు మా పర్యవేక్షణలోనే ఉంటాయి అది గుర్తుంచుకోండి అంటూ ముందస్తు హెచ్చరికలు చేయడంతో షాపు అనుమతులకోసం అధికారులను సంప్రదించే వారు నోరు మూసుకుని అడిగినంత సమర్పించి అనుమతులు తీసుకుంటున్నారు.






