అక్రమ ఇసుక రవాణా.. నలుగురు బైండోవర్

by Bhanu |

బుధవారం ఉదయం మోతే వాగు నుండి కురిక్యాల గ్రామానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను కురిక్యాలలో గుర్తించిన పోలీసులు, తక్షణమే అదుపులోకి తీసుకున్నారు.

అక్రమ ఇసుక రవాణా.. నలుగురు బైండోవర్
X

దిశ, గంగాధర: బుధవారం ఉదయం మోతే వాగు నుండి కురిక్యాల గ్రామానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను కురిక్యాలలో గుర్తించిన పోలీసులు, తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. గంగాధర ట్రైన్ ఎస్సై, ఎస్‌ఎచ్‌ఓ స్వాతి ఆధ్వర్యంలో జరిగిన దాడిలో, అక్రమ ఇసుక రవాణాకు సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను, మండల తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా నివారణకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.


Next Story