- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కబ్జా కోర్లకు అవకాశం ఇస్తే ఊరు వల్ల కాడే : ఎమ్మెల్యే కవ్వంపల్లి
దిశ, శంకరపట్నం : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

దిశ, శంకరపట్నం : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండలంలోని కరీంపేట గ్రామంలో బుధవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కరీంపేటను వల్లకాడుగా మార్చిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నుకోవద్దని సూచించారు. అలాంటి వారికి ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామంలో వర్గ పోరు రాజకీయాలు పెంచుతారని పేర్కొన్నారు. గతంలో వారి అరాచకాలు, భూ కబ్జాలతో గ్రామం అట్టుడికి పోయిందన్నారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అప్పటి ప్రభుత్వం, ఎమ్మెల్యే అండ చూసుకొని ఈ గ్రామంలో భూ కబ్జా కోర్లు రెచ్చిపోయారని తెలిపారు. దీంతో అనేక కుటుంబాల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కవ్వంపల్లి తెలిపారు. అలాంటి వారికి గ్రామ రాజకీయాలలో ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వద్దని, ఒకవేళ ఇస్తే వారి ఆగడాలకు అంతులేకుండా పోతుందన్నారు.
దీంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని కాబట్టి ప్రభుత్వపరంగా వ్యక్తి గతంగా కూడా కరీంపేట గ్రామాభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎలాంటి ఆలోచనలు చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఎగ్గని శ్రీలత రమేష్ లకు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. వీరిని గెలిపిస్తే సంక్షేమ ,అభివృద్ధి పథకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలకు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఎగ్గని రమేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోపి రాజమల్లు, మాజీ ఉపసర్పంచ్ చింతం కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు,ఆడెపు దశరథం, ఆడెపు దామోదర్ , మేడిశెట్టి చిన్న భూమయ్య ,మాజీ సర్పంచ్ వనపర్తి మల్లయ్య , చింతం రాజేశం ,వనపర్తి ప్రసాద్, దుండే శ్రీనివాస్,కారం కంటి శ్రీనివాస్ ఇతర కాంగ్రెస్ నాయకులు బొజ్జ స్వామి, మేరుగు సురేష్, బొజ్జ అనీల్, మేరుగు రాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






