స‌ర్పంచ్ గా గెలిపించ‌క‌పోతే ఆ విష‌యం బ‌హిర్గతం చేస్తా

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-07 10:02:36  IST  )

దిశ‌, కోరుట్ల : సర్పంచ్ ఎన్నికల వేళ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని అక్కడక్కడ వీడీసీలు సర్పంచ్ పదవీ కి

స‌ర్పంచ్ గా గెలిపించ‌క‌పోతే  ఆ విష‌యం బ‌హిర్గతం చేస్తా
X

దిశ‌, కోరుట్ల : సర్పంచ్ ఎన్నికల వేళ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని అక్కడక్కడ వీడీసీలు సర్పంచ్ పదవీ కి వేలం పాటలు నిర్వహించడం, అధికారులు జోక్యం చేసుకుని నిర్వీర్యం చేసిన ఘటనలు జరిగాయి. కానీ ఆ గ్రామంలో వీడీసీ చైర్మన్ కొనసాగుతున్న ఓ సర్పంచ్ అభ్యర్థి మాత్రం మిగితా వీడీసీలకే దంకి ఇచ్చినంత పని చేసాడు ఓసర్పంచ్ అభ్యర్థి. వివరాల్లోకి వెళ్లితే.. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం లోని గోదావరి పరివాహక గ్రామం లో ఆదివారం గోదావరి తీరన వీడీసీ సభ్యులు బైఠాయించారు. ఆ గ్రామానికి వీడీసీ చైర్మన్ గా కొనసాగుతున్న ఓ మాజీ సర్పంచ్ భర్త ఆ గ్రామానికి వీడీసీ చైర్మన్ గా కొనసాగుతూ గ్రామంలోని స‌మాంత‌ర‌ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నెలకొన్న ఘటన సర్పంచ్ అభ్యర్థి కి కల్సి వస్తుందనుకున్నాడో ఎమో, ఓ ప్రభుత్వ భూమిని గ్రామ వీడీసీల ఆధ్వర్యంలో సంఘాల వారిగా పంచుకొని ప్లాట్లుగా మార్చుకొన్నారు. గ్రామం లోని సంఘాల్లో లేని వాళ్ళ వద్ద ఒక్కో ప్లాటుకి రూ.25వేలు వ‌సూలు చేసి వారికి అనధికారికంగా ప్రభుత్వ భూమిలో హద్ధులు పాతి ప్లాట్ లు కేటాయించినట్లు సమాచారం.


అంతే కాకుండా గోదావరి తీరనా ఎండోమెంట్ భూమి లో కొద్దరికి వ్యవసాయం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ వారి వద్ద కూడా ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి పేరిట డబ్బులు వాసులు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామంలో జరిగే ఏ ఒక్క విషయం అధికారుల ద్రుష్టి కి తీసుకువెళ్తే వారిని గ్రామ, లేదా సంఘ బహిష్కరణ చేస్తామని హెచ్చ‌రించారు. దీంతో లాభం వచ్చే పనే కదా అని గ్రామస్తులు సైతం నిశబ్దం పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది వరకే ఈ గ్రామంలో, బెల్ట్ షాప్, చికెన్ కూల్డ్రింక్స్, పెట్రోల్, డీజిల్ అమ్మకానికి వేలం పాటలు నిర్వహించగా అదే గ్రామానికి చెందిన వారు వెలం పాటలు దక్కించుకున్నారు. ఓ స‌మాంత‌ర‌ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న గ్రామ వీడీసీలకు, అధికారులు సైతం చూసి చూడనట్టు ఉందటం వెనుక అంతర్యమేంటి..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చట్ట బద్దంగా జర‌గాల్సిన‌ ఎన్నికలను బెదిరింపులకు పాల్పడుతున్న సర్పంచ్ అభ్యర్థి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Next Story