కొత్త గట్టుగుట్ట పై పురాతన వీరగల్లు శిల గుర్తింపు

by Nallavelli.Anjaneyulu |

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గుట్ట పై కొలువైన శ్రీ మత్స్య గిరీంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఓ మూలన దుమ్ము పట్టి కొంత అరిగిపోయిన వీరగల్లు శిలను గుర్తించినట్టు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపే రాజకుమార్ తెలిపారు.

కొత్త గట్టుగుట్ట పై పురాతన వీరగల్లు శిల గుర్తింపు
X

దిశ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గుట్ట పై కొలువైన శ్రీ మత్స్య గిరీంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఓ మూలన దుమ్ము పట్టి కొంత అరిగిపోయిన వీరగల్లు శిలను గుర్తించినట్టు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపే రాజకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుట్ట పైన గల ఈ వీరగల్లు సతి శిల అని వీరగల్లును సతి శిలను కలిపి చెక్కడం విశిష్టమైన విషయం అని క్రీస్తు శకం పన్నెండో శతాబ్దానికి చెందిన ఈ శిలా ఎర్రరాయిపై చెక్కబడిన చాళుక్య శైలి శిల్పం అన్నారు .

ఈ అపూర్వ శిల్పంలో వీరుడు కుడిచేతిలో ఖడ్గంతో, ఎడమచేతిలో డాలుతో అశ్వారూఢుడై‌ ముందుకు సాగుతుండగాఅతని భార్య అతనికి ఊర్ద్వలోక దారి చూపిస్తున్నదని, సేవకుడు వెంట వస్తున్నట్లు ఉందన్నారు. దీనిని బట్టి యుద్ధంలో రాజు అసువులు బాయగా రాణి, రాజును అనుసరించిందని.. వారిరువురిని లెంక అనుసరించినట్లు తేటతెల్లమవుతోందన్నారు. ఈ ముగ్గురిని స్మారకంగా చెక్కిన అరుదైన వీరగల్లు శిల్పమిది అని అన్నారు. మహిషాసుర మర్దిని శిలను కూడా గుర్తించినట్లు తెలిపారు. భవిష్యత్ త‌రాలకు వీరి చరిత్ర చెప్పడానికి ఈ శిల్పాలను భద్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Next Story