అర్ధరాత్రి హైనా సంచారం...

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-10 13:41:15  IST  )

జగిత్యాల జిల్లాలో హైనా సంచారంతో కలకలం

అర్ధరాత్రి హైనా సంచారం...
X

అర్ధరాత్రి హైనా సంచారం...

- కుక్కపై దాడి.. భయాందోళనలో స్థానికులు

- జగిత్యాల జిల్లాలో హైనా సంచారంతో కలకలం

దిశ, మల్యాల : జగిత్యాల జిల్లాలో హైనా సంచారం కలకలం రేపింది. మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని గిడ్డంగి భవనం వద్ద హైనా అర్థరాత్రి ఓ కుక్కపై దాడి చేసి హతమార్చింది. హైనా సంచారంపై ఫారెస్ట్ అధికారులకు గిడ్డంగి హమాలీలు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వచ్చి హైనా అడుగుల ఆనవాళ్లు సేకరించారు. హైనా అని నిర్ధారించారు. గిడ్డంగి భవనంలో సీసీ ఫుటేజ్ ఉన్నప్పటికీ పనిచేయకపోవడంతో హమాలీలు ఆందోళన వ్యక్తం చేశారు. గిడ్డంగి భవనంలో సెక్యూరిటీ గార్డు లేకపోవడం గోదాంలో పరికరాలు, కార్యకలాపాలపై నిఘా లేకపోవడం అనూహ్య సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయని పలువురు ఆరోపించారు. హైనా సంచారంతో గిడ్డంగి హమాలీలు భయాందోళనకు గురయ్యారు.

Next Story