భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు

by velandi.Saikiran |

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదుతో పాటు రూ.2500ల జరిమానాను విధిస్తూ జగిత్యాల జడ్జి రత్న పద్మావతి

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు
X

దిశ, జగిత్యాల టౌన్: భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదుతో పాటు రూ.2500ల జరిమానాను విధిస్తూ జగిత్యాల జడ్జి రత్న పద్మావతి తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే రాయికల్ పట్టణానికి చెందిన అరిపల్లి సత్తయ్య, సుధారాణి భార్యా, భర్తలు. వీరికి ఇద్దరు కుమారులు. సత్తయ్య ఇంటి వద్ద ఉంటూ ఏ పని చేయకుండా నిత్యం భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఇదే విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు అయ్యేవి. ఇక 2020 ఆగస్టులో సుధారాణి గొంతు కోసి హత్య చేసాడు భర్త సత్తయ్య. ఇక మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై నిందితుడుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్ష్యాదారాలను పరిశీలించిన కోర్టు... నిందితునికి జీవిత ఖైదు విధించింది.

Next Story