- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందడంతో పాటు భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, గోపాల్ పేట : రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందడంతో పాటు భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై జగన్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. రేవల్లి మండల పరిధిలోని చిరుకపల్లి గ్రామానికి చెందిన పోతుల కేశవులు, వనజ దంపతులు. వాళ్లు కూతురు స్వప్న బిడ్డ పుట్టిన రోజు కావడంతో మహబూబ్ నగర్ కి బైకు పై వెళ్తున్నారు. మార్గ మధ్యలో రేకుల గడ్డ దాటిన తరువాత ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బైకు ను కారు ఢీ కొట్టింది. దీంతో కేశవులు తలకు గాయం అయింది. అలాగే కాలు ఫ్రాక్షర్ అయింది. భార్య వనజ కూడా గాయపడింది. వీరిద్దరినీ తక్షణమే 108 సహాయంతో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. చికిత్స పొందుతూ పోతులపల్లి కేశవులు మృతి చెందాడు. కూతురు స్వప్న ఫిర్యాదు మేరకు నవపేట మండలం పొమల్ గ్రామానికి చెందిన డ్రైవర్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జగన్ మోహన్ తెలిపారు.






