- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది రోడ్డు కాదు.. నరకానికి దారి
వీణవంక నుంచి కరీంనగర్ కు వెళ్లే ప్రధాన రహదారి నిత్యం వాహనదారులతో రద్దీగా ఉంటుంది.

దిశ, వీణవంక : వీణవంక నుంచి కరీంనగర్ కు వెళ్లే ప్రధాన రహదారి నిత్యం వాహనదారులతో రద్దీగా ఉంటుంది. మండలంలో ఇసుక రీచ్ లు మొదలైనప్పటి నుంచి ఈ రోడ్డు ఇసుక లారీలకు అడ్డాగా మారింది. మండలంలో ఎటు చూసినా లారీలే కనపడేసరికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల ప్రజలు రోడ్డెక్కి ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. లారీ డ్రైవర్లు ఇష్టం వచ్చినట్టు లారీలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రధాన రహదారిపై లారీల పార్కింగ్ ఒకవైపు అయితే ఇసుక లోడ్ చేసుకొని లారీలు వెళ్తున్నప్పుడు వెలువడే దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు ప్రధాన రహదారిపై లారీలు నిలవడంతో ప్రయాణికులకు, ఆయా గ్రామ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులకు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకునేవారు లేరని వాపోతున్నారు. రీచ్ నిర్వాహకులు తమకి ఇష్టం వచ్చినట్టు వివరిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
ప్రధాన రహదారిపైనే లారీల పార్కింగ్..
కల్లూరు రీచ్ నుంచి ఇసుకను తరలించకపోయే లారీలు మొత్తం రోడ్లపైనే పార్కింగ్ చేయడం వల్ల చల్లూరు నుంచి మామిడాల పల్లి వరకు వందల కొద్ది లారీలు రోడ్లపై నిలపడంతో ప్రయాణికులు ఆయా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెల్లూరు నుంచి మావిడాలపల్లెకు వెళ్లాలంటే దూరం మూడు కిలోమీటర్లు కానీ ప్రయాణం 30 నిమిషాలు పడుతుందని ఒకవైపు లారీల పార్కింగ్ మరోవైపు ఇసుక లోడ్ చేసుకొని వెళుతున్న లారీ ఒకరిని మించి ఒకరు అతివేగంగా వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, వెళ్తున్నప్పుడు వెలువడే దుమ్ముతో అనేక అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించి రోడ్డుపై లారీలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని లారీల వేగం నియంత్రణ చేయాలని కోరుతున్నారు.
దుమ్ముతో అనారోగ్య సమస్యలు
లారీలు వెళ్తున్నప్పుడు వెలువడ దుమ్ముతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని రీచ్ నిర్వాహకులు రోడ్డు వెంట దుమ్ము వెలవాడకుండా తగు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా కూడా తమకేమీ పట్టనట్టు వివరిస్తున్నారు. దుమ్ముతో లేని రోగాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పోతిరెడ్డిపల్లి నుండి రెడ్డిపల్లి కి వచ్చే రహదారి చిన్న రోడ్ కాబట్టి రోడ్డంతా డ్యామేజ్ అయి పెద్ద పెద్ద గుంతలు పడి లారీలు ప్రయాణిస్తున్న సమయంలో అనేకమైన దుమ్ము వెలబడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దుమ్ము వలన తమ పంట పొలాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని పోతిరెడ్డిపల్లి నుండి రెడ్డిపల్లి వచ్చే రోడ్డు మరమ్మతు చేసి దుమ్ము వెలబడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. అధికారులు ఇదేవిధంగా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తే ప్రజలే రోడ్లిక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.






