ఇంకా ఎన్నాళ్లు ఈ రోడ్ల గోస‌..?

by Ratna Kumari |

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల ప్రజలు రోడ్ల దుస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవ‌త్స‌రాలు గ‌డిచినా, ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా గ్రామీణ రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

ఇంకా ఎన్నాళ్లు ఈ రోడ్ల గోస‌..?
X

దిశ, దౌల్తాబాద్ : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల ప్రజలు రోడ్ల దుస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవ‌త్స‌రాలు గ‌డిచినా, ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా గ్రామీణ రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. మా దుబ్బాక కాంసెన్సీ లో 'ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు. ఎంపీ ఎమ్మెల్యే అయ్యాడు… కానీ మా కంకర రోడ్డు మాత్రం డాంబర్ రోడ్డు కాలేదు. అంటూ ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. గుంతలతో నిండిపోయిన రోడ్లు రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని వారు చెబుతున్నారు. మండల పరిధిలోని మొండిచింత నుఁడి బేగంపేట్,వరకు రామారం–గొల్లపల్లి, ఇందుప్రియాల్మ-హమ్మద్ షాపూర్, గొడుగుపల్లి–మక్కరాజిపేట్ వంటి కీలక రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.

విద్యార్థులు చదువుల కోసం నిత్యం గజ్వేల్ వెళ్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ రోడ్లు మరింత దారుణంగా మారి ప్రయాణం చేయడమే కష్టంగా మారుతోంది. అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. కనీసం ఒక మనిషి ప్రాణం బాగోలేక 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ రావడానికి గంటల సమయం పడుతుండటంతో, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు బాగుంటేనే ప్రాణం బాగుంటుంది. కానీ మా పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అవుతున్నాయన్న ప్రచారం ఉన్నా, పనులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story