- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్..హైస్కూల్ గ్రౌండ్ నీరు తొలగింపు
చెరువును తలపిస్తున్న హైస్కూల్ గ్రౌండ్' అనే శీర్షికతో దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందిం

దిశ, హుజురాబాద్ రూరల్ : 'చెరువును తలపిస్తున్న హైస్కూల్ గ్రౌండ్' అనే శీర్షికతో దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించారు. ఈ కథనంలో పేర్కొన్న సమస్యను గుర్తించిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వెంటనే తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి గ్రౌండ్‌లో నిలిచి ఉన్న నీటిని తొలగించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హుజురాబాద్‌లోని హైస్కూల్ గ్రౌండ్ మొత్తం నీటితో నిండి చెరువులా మారిపోయింది. దీనివల్ల ఉదయం, సాయంత్రం వాకింగ్ కోసం వచ్చే వాకర్స్, క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిపై దిశ పత్రిక కథనం ప్రచురించింది.
దీనికి స్పందించిన కమిషనర్ సమ్మయ్య, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ లతో కలిసి పరిస్థితిని పర్యవేక్షించారు. నీరు నిలిచిపోవడానికి కారణాన్ని పరిశీలించగా, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనుల సందర్భంగా కాంట్రాక్టర్ గతంలో నీరు వెళ్లే పైపులైన్‌పై మట్టి పోసినట్లు గుర్తించారు. దీనివల్ల నీరు బయటికి వెళ్లే మార్గం మూసుకుపోయి గ్రౌండ్‌లో నిలిచిపోయింది. వెంటనే మున్సిపల్ సిబ్బంది... ఆ పైపులైన్‌ను క్లియర్ చేసి, నిలిచిపోయిన నీటిని పూర్తిగా తొలగించారు. దీంతో ఇప్పుడు గ్రౌండ్ ప్రజలకు, వాకర్స్‌కు తిరిగి అందుబాటులోకి వచ్చింది. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను స్థానిక ప్రజలు, వాకర్స్ అభినందించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి ప్రసాద్ మాట్లాడుతూ.. "దిశ పత్రిక మా సమస్యను వెలుగులోకి తీసుకురావడం వల్లనే ఇంత త్వరగా పరిష్కారం లభించిందని" సంతోషం వ్యక్తం చేశారు.






