ఆరోగ్యం బాగా లేదు.. స్వగ్రామానికి వస్తా.. గల్ఫ్ బాధితుడి వేడుకోలు..

by Thanuru Gopichand |   (  Updated:2025-10-26 04:32:34  IST  )

బతుకు దెరువు కోసం ఎడారి దేశానికి వలస వెళ్లిన ఓ పేద బిడ్డ ఆరోగ్యం సహకరించడం లేదని..

ఆరోగ్యం బాగా లేదు.. స్వగ్రామానికి వస్తా.. గల్ఫ్ బాధితుడి వేడుకోలు..
X

దిశ, తంగళ్లపల్లి : బతుకు దెరువు కోసం ఎడారి దేశానికి వలస వెళ్లిన ఓ పేద బిడ్డ ఆరోగ్యం సహకరించడం లేదని.. తనను స్వగ్రామానికి వచ్చేలా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బాలసాని సత్తయ్య ఇటీవల బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశానికి వలస వెళ్లాడు. అయితే పొట్టకూటి కోసం దేశం కానీ దేశం వస్తే ఆరోగ్యం క్షీణించి పనిచేసే పరిస్థితి లేదని, తిరిగి ఇంటికి రావాలంటే డబ్బులు లేని పరిస్థితి ఉందని తన సోషల్ మీడియా వీడియోలో వాపోయాడు. ఇక్కడ పనిలో చేరిన కంపెనీకి డబ్బులు చెల్లించడంతోపాటు స్వదేశానికి వచ్చేందుకు టికెట్ కోసం డబ్బులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దాతలు స్పందించి తనను స్వదేశానికి రప్పించేలా చొరవ తీసుకోవాలని కన్నీటి పర్యంతమవుతూ సోషల్ మీడియాలో వేడుకున్నాడు.

Next Story