- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన పేరు పెడితే ఈయన రానన్నారు
అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించలేదని అంతే కాకుండా విగ్రహదాత రసమయి పేరు కూడా శిలా పలకం పై లేకపోవడం దేనికి సంకేతం అన్నారు.

దిశ, శంకరపట్నం : వివక్ష లేని సమాజాన్ని నిర్మిస్తున్నామని ప్రగల్భాలు పలికే నాయకులు వారి సామాజిక వర్గాన్నే చిన్న చూపు చూస్తున్నారా? అధికారంలో ఉన్నా ప్రతి పక్షంలో ఉన్న హుందాగా వ్యవహరించాల్సిన నాయకులు పంతాలకు, పట్టింపులకు పోయి తమ జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారా? కుల వివక్ష ఎక్కడో లేదని తమ వారే తమ సామాజిక వర్గాన్ని లెక్క చేయడం లేదని ఆ సామాజిక వర్గం వ్యక్తులు ఆవేదన వెలుబుచ్చారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఓ మాజీ మహిళా సర్పంచ్ తనకు అవమానం జరిగిందని కేశవపట్నం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బోరున విలపించింది. మాజీ సర్పంచ్ ఆడెపు రజిత మాట్లాడుతూ.. శంకరపట్నం మండలంలోని చింతగుట్ట గ్రామ మొదటి మహిళా సర్పంచ్ గా పని చేసానని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ విగ్రహాన్ని రసమయి బాలకిషన్ తన సొంత డబ్బులతో కొనుగోలు చేసి గ్రామానికి ఇచ్చినట్లు తెలిపింది.కాని ఈ లోపు ఎన్నికలు రావడం తో విగ్రహ ఆవిష్కరణ సాధ్యం కాలేదని తెలిపింది.తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు నూతన సర్పంచ్ అధికారం చేపట్టారని అన్నారు. అంబేద్కర్ విగ్రహం కోసం స్థల సేకరణ తో పాటు అన్ని పనులు చేసిన తనను అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించలేదని అంతే కాకుండా విగ్రహదాత రసమయి పేరు కూడా శిలా పలకం పై లేకపోవడం దేనికి సంకేతం అన్నారు.రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని పోలీసుల బందోబస్తు మధ్య ఆవిష్కరించడం ఎంతవరకు సమంజసంమన్నారు
ఆయన పేరు ఉంటే ఈయన రానన్నారు
రసమయి బాలకిషన్ పేరు శిలాఫలకం పై ఉంటే తాను రానని ఖరాకండి గా ఎమ్మెల్యే తెలిపాడని విగ్రహావిష్కరణ రోజు తనను గృహ నిర్బంధం చేశారని ఒక మాజీ మహిళా సర్పంచ్ కి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎమ్మెల్యేను తప్పు దోవ పట్టించారని ముఖ్యంగా మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ కావాలని ఈ సమస్యను సృష్టించారని అన్నారు. వారం లోగా తనకు కవ్వంపల్లి సత్యనారాయణ క్షమాపణ చెప్పాలని లేనిచో కుల సంఘాల నాయకులతో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సర్పంచ్ కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మైపాల్ ,మాజీ జెడ్పిటి లు శ్రీనివాస్ రెడ్డి, ప్రొద్దుటూరు సంజీవరెడ్డి,మాజీ సర్పంచులు పాల్గొన్నారు.






