- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిన్న దుబాయ్ నుంచి రాక.. ఈ రోజు ఆత్మహత్య
by Bhanu |
బయట దేశంలో ఆశలతో పనిచేసి వచ్చిన వ్యక్తి స్వగ్రామానికి రాగానే విషాదాంతం చోటు చేసుకుంది. బోయినిపల్లి మండలంలోని తడగొండ గ్రామానికి చెందిన కుంటాల హరీష్ (35) కుటుంబ అవసరాల నిమిత్తం దుబాయ్‌లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

X
దిశ, బోయినిపల్లి : బయట దేశంలో ఆశలతో పనిచేసి వచ్చిన వ్యక్తి స్వగ్రామానికి రాగానే విషాదాంతం చోటు చేసుకుంది. బోయినిపల్లి మండలంలోని తడగొండ గ్రామానికి చెందిన కుంటాల హరీష్ (35) కుటుంబ అవసరాల నిమిత్తం దుబాయ్‌లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే సోమవారం సాయంత్రం స్వగ్రామానికి తిరిగి వచ్చిన అతడు 24 గంటలు కాకముందే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
తడగొండ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో దూకి హరీష్ జీవితాన్ని ముగించుకున్నాడు. ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య కావేరి, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఒక్కసారిగా ఇలా జరిగిపోవడం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.
Next Story






