విషాదంలో మహా పుణ్యదానం..!

by Ratna Kumari |

పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన దాసరి రామచందర్(70) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

విషాదంలో మహా పుణ్యదానం..!
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన దాసరి రామచందర్(70) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతితో విషాదంలో ఉన్న కుటుంబం, మానవత్వాన్ని చాటుతూ అతని నేత్రాలను దానం చేసి ఇద్దరు అంధులకు వెలుగులు పంచారు. మూడు నెలల క్రితం తల్లి మల్లమ్మ మరణించడంతో, ఆమె నేత్రాలను దానం చేసిన కుటుంబం, ఇప్పుడు తండ్రి రామ్ చందర్ నేత్రాలను కూడా దానం చేసేందుకు కొడుకు-కోడలు పద్మారావు-కావ్య, కూతుళ్లు-అల్లుళ్లు సువర్ణ-గోపాల్, మాధవి-రాజు, సుష్మా-కుమార్ ముందుకు వచ్చారు. సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కే.ఎస్. వాసు మృతుని కార్నియాలను సేకరించి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్‌కు తరలించారు. నేత్రదాతకు నివాళులర్పించి, అభినందన పత్రాన్ని అందజేశారు. దుఃఖ సమయంలోనూ ఉదాత్త మనసుతో నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి. శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేష్, మారెల్లి రాజిరెడ్డి, లగిశెట్టి చంద్రమౌళి అభినందించారు.

Next Story