పోలీస్ ఎగ్జిబిషన్ మేళాకు విశేష స్పందన

by Disha Web Desk 1 |
పోలీస్ ఎగ్జిబిషన్ మేళాకు విశేష స్పందన
X

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ డాగ్స్, ఆయుధాల ప్రదర్శన

దిశ, కోనరావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఎస్పీ అఖిల్ మహాజన్ అధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో భాగంగా వాహనాల తనిఖీల సమయంలో, గంజాయి, మత్తు పదార్థాలను ఎలా పట్టుకోవాలో వివరించారు. బాంబులను గుర్తించడం, నిర్వీర్యం చేయడం, డాగ్ స్క్వాడ్ చే ప్రదర్శించారు. అదేవిధంగా పోలీస్ శాఖలో అమలవుతోన్న అధునాతన టెక్నాలజీ ఎలా వినియెగిస్తున్నారో పోలీస్ సిబ్బందికి వివరించారు. ఆయుధాల ప్రదర్శన, ఫోటో గ్యాలరీ, కమ్యూనికేషన్ గ్యాలరీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పోలీస్ శాఖలోని డాగ్ స్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ స్వ్కాడ్ ని జిల్లా కలెక్టర్, ఎస్పీ అభినందించారు. అనంతరం క్రాకర్స్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed