- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీధర్ బాబుకు గ్రాండ్వెల్కం..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు సోమవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రాండ్ వెల్కం తెలిపారు.

కర్ణాటక విజయం తరువాత తొలిసారి నియోజకవర్గానికి
అడుగడునా స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
దిశ, కరీంనగర్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు సోమవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రాండ్ వెల్కం తెలిపారు. కరీంనగర్నుంచి మొదలుకొని మంథని వరకు కాంగ్రెస్ శ్రేణులు శ్రీధర్ బాబుకు స్వాగతం పలికారు. అనంతరం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చీకురాయి రోడ్డు వద్ద పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అంతటి అన్నయ్య గౌడ్, సురేష్ గౌడ్, తదితరులు ఘన స్వాగతం పలికారు.






