- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాస్వామ్య విలువలను పాతర వేస్తున్న ప్రభుత్వం : చాడ వెంకట్ రెడ్డి
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో స్థానిక సీపీఐ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా స్వామ్య విలువలకు పాతర వేస్తున్నారని, పౌర హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కేంద్రం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుందని, బడాబడా కాంట్రాక్టర్ లకు, పెట్టుబడి దారులకి దాసోహం అయిందన్నారు. డాలర్ విలువ చూస్తే రూపాయి విలువ ఎంత పడిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రపంచంలో మూడో ఆర్థిక దేశం అని మోడీ చెబుతున్నారని, మాటలు చెప్పడమే తప్ప చేతల్లో చేసేదేమీ లేదన్నారు. మావోయిస్టులను సరెండర్ కాండీ లేదంటే చంపేస్తామన్న ధోరణి కనిపిస్తుందని, వారు నెల రోజులు సమయం ఇవ్వమని అడుగుతున్న ససేమీరా అంటున్న వైఖరి కనబడుతుందన్నారు. బూటకపు ఎన్ కౌంటర్ల పై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తే విషయాలు బయటికి వస్తాయని కానీ అలాంటి పరిస్థితి కనిపించటం లేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.






