- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర సుభిక్షం కోసం అంజన్నను ప్రార్థించిన ప్రభుత్వ విప్
by Ratna Kumari |
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

X
దిశ, కొండగట్టు : జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆ స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్. అంజనా రెడ్డి, ఏఈఓ గుండి హరిహరనాథ్, టెంపుల్ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌తో పాటు ఆలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Next Story






