- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుపయోగంగా ప్రభుత్వ వాహనాలు!
ప్రభుత్వ కార్యాలయాల్లో సర్కార్ వాహనాలు నిరూపయోగంగా మారి తుప్పు పడుతున్నాయి.. అధికారులు సైతం ప్రభుత్వ వాహనాల వైపు చూడకుండా అద్దె, సొంత వాహనాల వైపు ఆసక్తి చూపిస్తుండడంతో కార్యాలయాల్లో ప్రభుత్వ వాహనాలు ఆదరించేవారు లేక తప్పు పడుతున్నాయి.

నిరుపయోగంగా ప్రభుత్వ వాహనాలు!
- అద్దె, సొంత వాహనాల వైపు అధికారుల చూపు
- మంథని ఆర్డీఓ కార్యాలయంలో మూలన పడ్డ లక్షల విలువ చేసే వాహనం
- కార్యాలయాల్లో తుప్పు పడుతున్న ప్రజాధనం
- మరమ్మత్తులు చేసి వాడుకలోకి తేవాలంటున్న ప్రజలు
దిశ, మంథని : ప్రభుత్వ కార్యాలయాల్లో సర్కార్ వాహనాలు నిరూపయోగంగా మారి తుప్పు పడుతున్నాయి.. అధికారులు సైతం ప్రభుత్వ వాహనాల వైపు చూడకుండా అద్దె, సొంత వాహనాల వైపు ఆసక్తి చూపిస్తుండడంతో కార్యాలయాల్లో ప్రభుత్వ వాహనాలు ఆదరించేవారు లేక తప్పు పడుతున్నాయి. అధికారుల కోసం ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు కొన్ని నిరూపయోగంగా మారాయి. ప్రభుత్వాలు అధికారులకు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతో పాటు ప్రజల సమస్య లు తెలుసుకోవడానికి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారులకు ప్రభుత్వ వాహనాలను కేటాయించారు. కానీ కొన్ని చోట్ల ప్రభుత్వ వాహనాలను అధికారులు ఉపయోగించకపోవడంతో దేనికి పనికి రాకుండా వృథాగా నిరూపయోగంగా తుప్పు పట్టి పోతున్నాయి. కొన్ని సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వ వాహనాలను ఉపయోగించుకున్న అధికారులు రిపేరు రాగానే షెడ్డు లోనే పక్కన పెట్టేశారు. దీంతో సంవత్సరాల తరబడి ప్రభుత్వ వాహనాలు మరమ్మత్తులకు నోచుకోక పోవడంతో తుప్పు పట్టి పనికిరాకుండా పోతున్నాయి. మంథని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో మంథని ఆర్డీఓకు ప్రభుత్వం కేటాయించిన వాహనం నిరుపయోగంగా మారి షెడ్డులో మూలకు పడి ఉంది. ప్రభుత్వం నిధులను ఆదా చేయాల్సింది పోయి అనవసరంగా ఇలాంటి వాటికీ లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రజా ధనాన్ని వృధా చేసి ఆర్థిక లోటుకు గురు చేస్తున్నాయి. మంథనిలో నీటి పారుదల శాఖ, అబ్కారీ శాఖ, తహసీల్దార్ పలు కార్యాలయాల్లో అధికారులకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలు మూలన పడి తుప్పు పట్టి దేనికి పనికి రాకుండా పోయాయి. వాటిని మరమ్మతు చేసి ఉపయోగించాల్సిన అధికారులు అవేమీ పట్టించుకోకుండా దర్జాగా సొంత వాహనాలు, లేకుంటే అద్దె వాహనాలను ఉపయోగిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ప్రభుత్వ వాహనాలకు మరమ్మత్తులు చేసి వాడుకోవాల్సింది పోయి... సొంత, అద్దె వాహనాలను ఉపయోగించడం ఏంటని..? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మరమ్మతుకు గురైన వాహనాలను రిపేర్ చేసి తిరిగి వాడుకలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.






