- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూతన ఆవిష్కరణ లకు ప్రభుత్వ ప్రోత్సాహం : మంత్రి శ్రీధర్ బాబు
నూతన ఆవిష్కరణ లకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.

దిశ, మంథని : నూతన ఆవిష్కరణ లకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి మంథని బస్ డిపో ఎదురుగా టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్నోవేషన్ ఎక్స్ పో 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డ్రీమ్, రైస్, స్టార్ట్ నినాదంతో ఇన్నోవేషన్ ఎక్స్ పో 2026 ను మంథని లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మంథని లో ఉన్న టీ- వర్క్స్ యూనిట్ బృందం కలెక్టర్ సహాకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటిస్తూ విద్యార్థులు నూతన ఆవిష్కరణ పట్ల ఆసక్తి పెంపొందించే దిశగా కృషి చేశారని అన్నారు. నూతన ఆవిష్కరణలు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుందని అన్నారు.
టైర్ 2, టైర్ 3 , రూరల్ ప్రాంతాలకు కూడా ఐటీ, ఏఐ ఆధారిత రంగాలు విస్తరించడం వల్ల 2034 నాటికి తెలంగాణ ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించిన విధంగా పిల్లలు మంచి కలలు కని, వాటిని సాధించేందుకు కార్యాచరణ ప్రారంభించాలని మంత్రి సూచించారు.పిల్లల ఆలోచనలను పదును పెట్టేందుకు డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. మంథని లోని యువకులు నూతనంగా తయారు చేసిన వ్యవసాయ పవర్ ఫిడర్, ఆధునిక హెల్మెట్ తయారి వంటి అనేక ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మంథని లో టీ వర్క్స్ ఆధ్వర్యంలో డ్రీమ్, స్టార్ట్, రైస్ సంస్థ పని చేస్తుందని ని అన్నారు.
అనంతరం కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. టీ-వర్క్స్ యూనిట్ ను 7 నెలల క్రితం మంథని లో ప్రారంభించామని, ఇక్కడ పిల్లలు అనేక నూతన ఆవిష్కరణలు తయారు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారని తెలిపారు. జిల్లాలో ముందస్తుగా 20 ప్రభుత్వ పాఠశాలల్లో ఏ.ఐ. ఆధారిత బోధన,కృత్రిమ మేధస్సు పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించిన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.మంథని లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏ.ఐ. వాడకం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడంతో రాబోయే విద్యా సంవత్సరం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఏ.ఐ. బోధకం జరిగేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అన్నారు.జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఇన్నోవేషన్ ప్రోత్సహించే దిశగా ఎంఓయూ చేసుకునేందుకు ముందుకు వచ్చిన ఔత్సాహిక వేత్తలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఉన్న రోజు వారి సమస్యల పరిష్కారానికి మన ఆవిష్కరణలు ఉపయోగపడాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో టీ వర్క్స్ సి.ఈ.ఓ.జోగేందర్ , మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, ఆర్.డి.ఓ.సురేష్, తహసిల్దార్ ఆరిపోద్దిన్,మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






