- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానకొండూర్ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త రోడ్లు
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మంగళవారం నియోజకవర్గంలో కలెక్టర్ చిత్రా మిశ్రా, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలో రోడ్లను పరిశీలించారు

దిశ, మానకొండూర్ : కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మంగళవారం నియోజకవర్గంలో కలెక్టర్ చిత్రా మిశ్రా, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలో రోడ్లను పరిశీలించారు. ఈ పర్యటనలో గుంతలమయమైన రోడ్లు, శిథిలావస్థకు చేరుకున్న కల్వర్టులు, వంతెనలను కలెక్టర్ స్వయంగా చూసి సమస్య తీవ్రతను గుర్తించారు.
త్వరలో కొత్త రోడ్లు
రోడ్ల దుస్థితిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ప్రభుత్వ అనుమతులతో ఈ మార్గంలో కొత్త రోడ్ల పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు వాహనదారులు, గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్లకు 'మహర్దశ' కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, తహశీల్దార్ విజయ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.






