- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ ఫలితాల్లో గొల్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం
కార్పొరేట్ కాలేజ్ లలోనే కాదు.. ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలలో చదివి కూడా స్టేట్ ర్యాంకులు సాధించవచ్చని నిరూపించారు గొల్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు.

దిశ, గొల్లపల్లి : కార్పొరేట్ కాలేజ్ లలోనే కాదు.. ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలలో చదివి కూడా స్టేట్ ర్యాంకులు సాధించవచ్చని నిరూపించారు గొల్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కు చెందిన పలువురు విద్యార్థులు ఆదివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా స్టేట్ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ లో 1000 మార్కులకు బంక వైష్ణవి 990, నాగపూరి శ్రీవాణి 985 మార్కులతో స్టేట్ ర్యాంక్ లు సాధించారని ప్రిన్సిపాల్ సుంకే రవి ఒక ప్రకటనలో తెలిపారు. వీరితో పాటు బైపీసీ లో మయూరి 939, అక్షర 894, సీఈసీ లో జ్యోతిక 944, గౌతమి 936 మార్కులు సాధించారాని తెలిపారు. అలాగే ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు మానస 446, ఆకాంక్ష 442 మార్కులు, బైపీసీ లో 440 మార్కులకు అనుశ్రీ 430, హంసిక 428 మార్కులతో అద్భుత ఫలితాలు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఇంతటి అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, ఇందుకు సహకరించిన అధ్యాపకులను ప్రిన్సిపాల్ రవి కృతజ్ఞతలు తెలియజేసారు.






