- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొల్లపల్లి లో భారీ ప్రమాదం.. 11కేవీ విద్యుత్ వైర్ తెగిపడి మంటలు
ప్రమాదవశాత్తు 11 కె.వి విద్యుత్ వైరు తెగిపడి మంటలు చెలరేగడంతో గొల్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజు భారీ ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, గొల్లపల్లి : ప్రమాదవశాత్తు 11 కె.వి విద్యుత్ వైరు తెగిపడి మంటలు చెలరేగడంతో గొల్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజు భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని మాడల్ స్కూల్ సమీపంలోని అర్చనపెల్లి పద్మ ఇంటి దగ్గర గొల్లపల్లి నుండి వెనుగుమట్ల వెళ్లే 11 కేవీ విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తేగి కింద పడి బారీగా మంటలు చెలరేగడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పాటు మంటలను సకాలంలో ఆర్పి వేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.కాగా ఈ ఘటనలో టాటా ఏస్, స్కూటీ తో పాటు ఇంటి ఆవరణలో అరబోసిన 25 క్వింటాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలి 8 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, పరిహారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితురాలు పద్మ ప్రభుత్వాన్ని కోరారు.






