- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gauravelli Project : ప్రభుత్వానికి రైతులు సహకరించాలి
by Sridhar Babu |
గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం నవాబుపేట గ్రామంలో నలభై నాలుగు ఎకరాల పరిధిలో భూమిని సర్వే చేశామని కరీంనగర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.కిరణ్ ప్రకాష్ తెలిపారు.

X
దిశ, చిగురుమామిడి : గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం నవాబుపేట గ్రామంలో నలభై నాలుగు ఎకరాల పరిధిలో భూమిని సర్వే చేశామని కరీంనగర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.కిరణ్ ప్రకాష్ తెలిపారు. మంగళవారం ఆయన చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో గ్రామస్తులు, రైతులతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని నలభై నాలుగు ఎకరాల భూమిలో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, అందులో ఏమేమి వనరులు ఉన్నాయో అధికారులతో మరోసారి సర్వే చేయించి నిర్ధారణ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా తాము రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి రైతులు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఇరిగేషన్ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story






