జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గరీమా అగ్రవాల్

by velandi.Saikiran |   (  Updated:2025-10-23 09:35:21  IST  )

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరీమా అగ్రవాల్ ను ప్రభుత్వం నియమించగా, బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన

జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గరీమా అగ్రవాల్
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరీమా అగ్రవాల్ ను ప్రభుత్వం నియమించగా, బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం ఆమె జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయానికి వచ్చిన ఆమెకు రెవెన్యూ అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబ‌ర్ లో ఆమె బాధ్యతలు స్వీకరించారు.

ఇంచార్జీ కలెక్టర్ గా సైతం

అయితే జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎం.హరిత సెలవుపై వెళ్లగా ఇంచార్జీ కలెక్టర్ గా సైతం గరీమా అగ్రవాల్ బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు అదనపు కలెక్టర్, జిల్లా ఇంచార్జీ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో రామ్ రెడ్డితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

స్థానిక సంస్థల వెనక కలెక్టర్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గరిమా అగ్రవాల్ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులకు ఆలయ అర్చకులు స్వస్తి వాచకంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వారికి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. కలెక్టర్ దంపతులకు ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ స్వామివారి, అమ్మవార్ల శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ ప్రకాష్ రావు ఆలయ అధికారులు తదితరులు ఉన్నారు.

Next Story