రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌గా గరీమా అగర్వాల్

by Kodari Anjali |

రాజన్న సిరిసిల్ల అదనపు (స్థానిక సంస్థలు) కలెక్టర్‌గా గరీమా అగర్వాల్‌ను ప్రభుత్వం నియమించింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌గా గరీమా అగర్వాల్
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల అదనపు (స్థానిక సంస్థలు) కలెక్టర్‌గా గరీమా అగర్వాల్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గరీమా అగర్వాల్ ప్రస్తుతం సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా సేవలందిస్తున్నారు. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన గరీమా అగర్వాల్ యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా రెండేళ్లు, కరీంనగర్ జిల్లా అదనపు (స్థానిక సంస్థలు) కలెక్టర్‌గా రెండేళ్లు పనిచేశారు.

Next Story