గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్

by Bhanu |

ఐదు గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు, నిందితులపై గతంలో 15 గంజాయి కేసులు జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే తెలిపారు.

గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ఐదు గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు, నిందితులపై గతంలో 15 గంజాయి కేసులు జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నిందితుని వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో 4 గంజాయి కేసులు, చందుర్తి పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసులలో పరారీలో ఉన్న హమ్మద్ అనే వ్యక్తి, సిరిసిల్లకు వస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం మేరకు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఎల్లమ్మ చౌరస్తా వద్ద అరెస్ట్ చేశారన్నారు. విచారణ అనంతరం రిమాండ్ కి తరలించడం జరుగుతుందన్నారు. అలాగే నిందితునిపై జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగాలపల్లి, బోయినపల్లి, చందుర్తి పోలీస్ స్టేషన్ లలో గతంలో 15 గంజాయి కేసులు నమోదు నమోదయినట్లు తెలిపారు.


జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడాని జిల్లా పోలీస్ శాఖ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని, గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలో గంజాయి విక్రయించిన, సాగు చేసిన, రవాణా చేసిన సేవించిన వారి సమాచారం ఆర్ఎస్-ఎన్ఏ బి 8712656392 నంబర్ కి అందించలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదని జిల్లా ఎస్పీ ఈసందర్భంగా తెలిపారు. సమావేశంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, క్రైమ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, కానిస్టేబుల్ ఇంతియాజ్ ఉన్నారు.


Next Story