పిడుగు పడి బర్రె మృతి

by Bhanu |

మండలానికి చెందిన కాసరం గ్రామంలో అకాల వర్షాలతో కూడిన ఈదురు గాలులతో పిడుగు పడిన ఘటన చోటుచేసుకుంది.

పిడుగు పడి బర్రె మృతి
X

దిశ, గంగాధర : మండలానికి చెందిన కాసరం గ్రామంలో అకాల వర్షాలతో కూడిన ఈదురు గాలులతో పిడుగు పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాసరం గ్రామానికి చెందిన రైతు పెద్దిపెల్లి తిరుపతికి చెందిన బర్రె మృతి చెందింది. ఈ బర్రె విలువ దాదాపు రూ.75వేల వరకు ఉంటుందని రైతు వాపోయారు. పిడుగు ఒక్కసారిగా పడడంతో బర్రె సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. రైతు తిరుపతి బర్రె పై ఆధారపడిన నేపథ్యంలో, ఈ ఘటన అతనికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కల్గింది. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని రైతు కోరుతున్నాడు.

Next Story