జగిత్యాలలో బైక్ దొంగల ముఠా అరెస్ట్

by Ratna Kumari |

జగిత్యాల పట్టణంలో గత 15 రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువైన 5 దొంగతనపు బైకులను రికవరీ చేసినట్టు పట్టణ సీఐ కరుణాకర్ వెల్లడించారు.

జగిత్యాలలో బైక్ దొంగల ముఠా అరెస్ట్
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పట్టణంలో గత 15 రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువైన 5 దొంగతనపు బైకులను రికవరీ చేసినట్టు పట్టణ సీఐ కరుణాకర్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. గత కొద్ది రోజులుగా పట్టణంలో ఐదు బైకులు చోరీకి గురికావడంతో పోలీసులు కేసులు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. బుదవారం జగిత్యాల రాజీవ్ చౌరస్తా బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా.. అదే సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారు మండలి పవన్ కళ్యాణ్, అంపోల సాయి కృష్ణ గా గుర్తించారు. నిందితులు ఇద్దరూ తాము దొంగిలించిన ఐదు బైకులలో ఒక వాహనాన్ని జగిత్యాల నుంచి ధర్మపురికి తీసుకెళ్లి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కారు. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.

Next Story